ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : విద్యా రంగం సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభ ఆదోనిలోని నేషనల్ స్కూల్లో శనివారం ప్రారంభమైంది. సంఘం జిల్లా అధ్యక్షుడు రంగప్ప, కార్యదర్శి అబ్దుల్లా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు ఎస్‌ఎఫ్‌ఐ జెండా ఆవిష్కరించి సభను ప్రారంభించారు. ఈ సభకు మాజీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నేషనల్ స్కూల్ అధినేత గోపాల్ రెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాధాకఅష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు ప్రజాశక్తి జనరల్ మేనేజర్ నరసింహ డివైఎఫ్‌ఐ మాజీ నాయకుడు లక్ష్మణ్ హాజరయ్యారు ఇటీవల మరణించిన నాయకులకు నివాళి అర్పించారు రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడారు నూతన జాతీయ విద్యావిధానం అమలు ప్రవేటు వ్యక్తులకు అప్పగిస్తే పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విద్య పరిరక్షణకై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరిగే పోరాటంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్
