శిధిలావ్యవస్థలో తాసిల్దార్ కార్యాలయం 

Jun 8,2024 17:29 #Kurnool

చిన్నపాటి వర్షానికి అవస్థలు 
ఫైల్స్ కు భద్రత కరువు 
ప్రజాశక్తి-పత్తికొండ : పత్తికొండ తాసిల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికి నీరు కారుతూ కూర్చోవడానికి ఉద్యోగస్తులు పడుతున్న పాట్లు వర్ణాతితం. కార్యకలాపాల కోసం వచ్చిన విద్యార్థులు ప్రజాప్రతినిధులు రైతులు అవస్థలు తప్పడం లేదంటున్నారు . మద్రాస్ రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని 1827 సంవత్సరంలోని పత్తికొండ తాసిల్దార్ కార్యాలయం ఏర్పాటు చేశారు. తాసిల్దార్ తో పాటు ఆర్ఐ విఆర్వోలు తోపాటు వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు పరిపాలన కొనసాగిస్తున్నారు. పత్తికొండ మండలానికి సంబంధించిన 17 గ్రామపంచాయతీలు సంబంధించిన కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి. నిత్యం ప్రజలు కార్యకలాపాల కోసం కార్యాలయానికి వస్తూ వెళ్తుంటారు. దాదాపు 197 సంవత్సరాలు నుండి ప్రజలకు సంబంధించిన దస్తావేజులు కార్యాలయంలోని భద్రపరిచారు. ఆ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు పెచ్చులు ఊడి పడుతాయో అని ఉద్యోగస్తులు భయాందోళన చెందుతున్నారు. పెచ్చులు ఊడి పడిన సందర్భాలు ఉన్నాయని ఉద్యోగస్తులు చెబుతున్నారు. 2014 టిడిపి ప్రభుత్వంలో హయాంలో అప్పటి పత్తికొండ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ2018 సంవత్సరంలో నూతన తాసిల్దార్ కార్యాలయం ఏర్పాటుచేసి ప్రారంభించారు.ఆ కార్యాలయంలో అధికారులు ప్రజలకు కార్యకలాపాలు కొనసాగాయి. 2021 సంవత్సరంలోనే వైసిపి ప్రభుత్వం పత్తికొండ, తుగ్గలి, మద్దికేర ,వెల్దుర్తి, కృష్ణగిరి, ఆస్పరి, హలార్వి, హోలగుంద చిప్పగిరి మండలాలను కలుపుకొని పత్తికొండను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసింది.పత్తికొండ తాసిల్దార్ కార్యాలయాన్ని ఆర్డిఓ కార్యాలయం పేరు మార్చి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. తాసిల్దార్ కార్యాలయాన్ని పాత భవనంలోకి మార్చారు. భవనంలోనే కరెంటు నీటి సదుపాయం లేక ఉద్యోగస్తులు ప్రజల అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నూతన కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

➡️