ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఏపీ.ఎంసీఏ అసోసియేషన్ ఆధ్వర్యాన ఎపి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో వైద్యసేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సిహెచ్‌ఒల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం మండలం పరిధిలో పెద్దతుంబలం, పెద్దహరిహణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిహెచ్‌ఒ, ఎంఎల్హెచ్పిఎస్ శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 6 సంవత్సరాలుగా సిహెచ్ఓ ఎదుర్కుంటున్న సమస్యలను వివక్షను తెలియజేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీ.ఎంసీఏ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నాగరాజు మాట్లాడుతూ న్యాయంగా తమకు రావలసిన పెండింగ్లో ప్రోత్సాహకాలు, 23%హైక్, ఈపీఎఫ్ పున్నూరుద్ధరణ, ఆయుష్మన్ భారత్ నియమాల ప్రకారం సిహెచ్ఓనీ రెగ్యులర్ చేయడం, ఫిక్సెడ్ పే, హెల్త్ పాలసీ,అద్దె బకాయిల,నిర్ధిష్టమైన జాబ్ చార్ట్ వెంటని కల్పించాలని డిమాండ్ చేస్తూ శాంత యుతంగా నిరసన కార్యక్రమం చేపట్టమన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ, ఎంఎల్హెచ్పిఎస్ చంద్రకళ, ఝాన్సీ, సులోచనా, రజిత, గిరిజా, కృష్ణవేణి పద్మావతి, షేక్షవలి, మద్దిలేటి పాల్గొన్నారు.
