‘ఈ’ కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి

Mar 26,2025 11:15 #Kurnool District

ప్రజాశక్తి – కోడుమూరు రూరల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బేడ, బుడగ, జంగాల కులాలను ఎస్సీ జాబితాలోకి చేర్చాలని అసెంబ్లీ తీర్మానాన్ని హర్షిస్తూ రాష్ట్ర బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు ఆదేశాల మేరకు హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా యూత్ అధ్యక్షుడు సిరిగిరి మద్ది ఆధ్వర్యంలో కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరినీ శాలువాతో పూలమాలలు వేసి సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో సిరిగిరి మద్ది మాట్లాడుతూ రాష్ట్రంలో 2008వ సంవత్సరము నుండి ఇప్పటివరకు సుమారు 17 సంవత్సరాలు కుల సర్టిఫికెట్లు లేక కుల సర్టిఫికెట్లు అనుసంధానమైన ఏ ప్రభుత్వ పథకాలు మాకు అందలేదని మా పిల్లలు చదువు కోవాలా లేక బిక్షాటన చేయాలా అని తెలియక ఎంతోమంది చదువుకు దూరం కావడం జరిగింది. ఇలాంటి కొన్ని పరిస్థితులని గమనించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు ఎమ్మెస్ రాజు మద్దతుతొ ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు, పాదయాత్ర, సైకిల్ యాత్ర, వంటి ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడం వల్ల కూటమి ప్రభుత్వం గుర్తించి బేడ బుడగ జంగాల కమ్యూనిటీని ఎలాగైనా ఎస్సీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానించడం జరిగింది. అలాగే పార్లమెంటులో కూడా అన్ని విధాలుగా మాకు సానుకూలంగా స్పందించి సర్టిఫికెట్లు అందేలా చూడాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా యూత్ అధ్యక్షుడు సిరిగిరి మద్ది, సీనియర్ నాయకులు ఈ భూతి రంగన్న ,సిరిగిరి తిమ్మప్ప,విభూతి జమ్మయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.

➡️