ప్రజాశక్తి – కోడుమూరు రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం తలపెట్టిన ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా కోడుమూరు పట్టణంలో శాంతినగర్ మాల వీధి పాత బస్టాండ్ సంత మార్కెట్ వీధుల్లో పాదయాత్ర నిర్వహించారు. సిపిఎం మండల కమిటీ సభ్యులు కే రాజు అధ్యక్షతన జరిగిన ఈ ప్రజా పోరు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేవీ నారాయణ హాజరై వీధి వీధి తిరిగారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలి. అందులో ఒక్క పెన్షన్ తప్ప ఏది అమలు చేయలేదు. గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితమన్నారు చాలామందికి డబ్బులు పడలేదన్నారు అలాగే ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది. పిల్లలు చదువుతుంటే అంతమందికి 15 వేల రూపాయలు వేస్తామని చెప్పారు. ఇంతవరకు వేయలేదు రైతులకు రైతు భరోసా కింద రూ.20 రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా అమలు చేయలేదు. ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో కరెంటు చార్జీలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఒకపక్క పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల వల్ల ఉపాధి లేక పేదలు అల్లాడుతుంటే ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించడంలో చాలా విఫలమైంది. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. కనీసం దాని మాటే ఎత్తడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నది ప్రకృతి ప్రసాదించిన ఇసుకను ఉచితంగా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు దానిని కూడా వ్యాపారంగా చూస్తున్నాయి. తామ అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానం తెస్తామని చెప్పి నేటికీ అమలు చేయడంలో నిర్లక్ష్యం ఉన్నది ఉచితం పేరుతో చాలామంది దోపిడీ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇసుకను బంగారం కంటే ఖరీదైనదిగా చేసినందువల్లే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించేశారు. భవన నిర్మాణ కార్మికులు లేక పస్తులున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఉపాధి సన్నగిల్లి ఆదాయాలు తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై 6072 కోట్ల విద్యుత్ భారాన్ని ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపడం అమానుషం ఏనాడో వాడిన కరెంటును ఏళ్లు గడిచిపోయాక నేడు అదనంగా చార్జీలు చెల్లించాలన్న విధానం మోసపూరితమైనది. గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ పట్టకుండా ఉండాలంటే ప్రజలకు మంచి సేవలు అందించాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి పేదలందరికీ అనువైన చోట ఇంటి స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలి. కోడుమూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు. చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలి. కోడుమూరు మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి. మండల కేంద్రంలో ఉర్దూ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలి. ఈ ప్రజా పోరు కార్యక్రమం ఈనెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాలకు వీధి వీధి తిరుగుతూ ప్రజా సమస్యలను తెల్సుకుంటూ వచ్చిన సమస్యలన్నిటిని కలిపి ఈ నెల 14వ తేదీన తాసిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గఫర్ మియా, జీపీ వీరన్న, కే లక్ష్మన్న, టీ వీరన్న, మునుస్వామి, కర్రె శంకర్, బండ బాబు, గిడ్డయ్య, ఎస్ గంగాధర్, రామన్న తదితరులు పాల్గొన్నారు.
