ప్రజాశక్తి తాడిపత్రి (అనంతపురం) : పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూ కొఠారి పేర్కొన్నారు.. తాడిపత్రి డివిజన్లోని బీసీ సంక్షేమ శాఖ లోని హాస్టల్స్ లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ- శిక్షణ తరగతుల్లో భాగంగా ఆదివారం తాడిపత్రి లోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రేరణ- శిక్షణ తరగతులు బీసీ సంక్షేమ శాఖ డివిజన్ అధికారి రంగమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుషఉ్బ కొఠారి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ… మార్చి 17వ తేదీ నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని, పరీక్షలకు సమయాన్ని వఅధా చేయకుండా బాగా చదువుకోవాలని సూచించారు. పాఠ్యాంశాలను డివైజ్ చేస్తుండాలన్నారు. మేము కచ్చితంగా పాస్ అవుతామని నమ్మకంతో ఉండాలన్నారు. మంచి ఆలోచన ఉండాలన్నారు. ఎవరి కోసమో కాకుండా మీకోసం మీరు కష్టపడాలన్నారు. మీ తల్లిదండ్రులకు చదువు విలువ బాగా తెలుసు కాబట్టి వారు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారన్నారు. ఏలాంటి పరిస్థితులు ఎదురైన చదువును మానుకోకూడదన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రతిరోజు పేపర్లు, పుస్తకాలు చదవడం వలన జనరల్ నాలెడ్జ్ పెరుగుతుందన్నారు. పదో తరగతి తర్వాత చదివే చదువులు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులను బాగా చదివించడం మా బాధ్యత అన్నారు. ఏదైనా అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. పదో తరగతి ఫలితాలు పైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, డైరెక్టర్, జిల్లా కలెక్టర్ సమీక్ష చేస్తున్నారన్నారు. విద్యార్థులు ఏప్పుడు డ్రాప్ అవుట్ కాకూడదన్నారు. విద్యార్థుల అంతా వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. పరీక్షలు బాగా రాసి హాస్టల్స్ నుండి మంచి ఫలితాలతో బయటకు వెళ్లాలన్నారు. అనంతరం క్రియేటర్ కృష్ణ విద్యార్థులకు పరీక్షలపై ఉండే భయాన్ని పోగొట్టేలా వారిలో చైతన్య పరుస్తూ ప్రేరణ కలిగించారు. అలాగే గణితము, సైన్స్, ఇంగ్లీషు సబ్జెక్టులపై ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ డీడీ సొంత ఖర్చులతో విద్యార్థులకు ప్యాడ్ ( అట్టలు), పిల్లలు, అనంతపురం వార్త రిపోర్టర్ బి. మల్లేసు తన సొంత ఖర్చులతో 220 మంది విద్యార్థులకు రూ 10 వేలు విలువచేసే కంబాక్స్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి ఎంఈఓ నాగరాజు, బిసి హాస్టల్స్ వార్డెన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మస్తాన్, డివిజన్ పరిధిలోని వార్డెన్లు, సిబ్బంది, పదో తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.
పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి : బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూ కొఠారి
