ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: మాగుంట కుటుంబ సభ్యులను మాజీ పార్లమెంట్ సభ్యులు కెవిపి రామచంద్రరావు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంగళవారం పరామ ర్శించారు. మాజీ పార్లమెంట్ సభ్యురాలు, మాజీ శాసనసభ్యురాలు మాగుంట పార్వతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. నెల్లూరు సరస్వతీ నగర్‌లోని మాగుంట నివాసంలో మాగుంట పార్వతమ్మ చిత్రపటానికి కెవిపి రామచంద్రరావు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, వారి కుటుంబ సభ్యులను కెవిపి రామచంద్రరావు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరామర్శించారు. మాగుంట పార్వతమ్మతో ఉన్న అనుబంధాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.