సామాజిక పోరాటాల్లో ముందు పీఠిన ‘కెవిపిఎస్‌’

ప్రజాశక్తి-మార్కాపురం కుల వివక్షను రూపుమాపే పోరాటాల్లో కెవిపిఎస్‌ ముందు పీఠిన నిలిచిం దని మార్కాపురం తహ శీల్దారు కె చిరంజీవి అన్నారు. కుల వివక్ష అంతమొందించేందుకు ఆ సంఘం చేస్తున్న కృషిని అభినందించారు. కెవిపిఎస్‌ రూపొందించిన 2025 క్యాలెండర్‌ను స్థానిక తహశీల్దారు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం నేరం అని, దానిని నిర్మూలించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు జవ్వాజి రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా బాలనాగయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి డికేఎం రఫీ, కెవిపిఎస్‌ నాయకులు కాశయ్య, దాసు, పి యాకోబు తదితరులు పాల్గొన్నారు.

➡️