‘ప్రజాశక్తి-మార్కాపురం: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతలో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్థానిక కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నెలకొల్పిన ‘డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్’ విజయవంతమైంది. ఈ విజయంలో ఆ కళాశాల విద్యార్థులు ప్రతిభన కనబరిచారు. ఇసిఇ విభాగం ఆధ్వర్యంలో ఈ ల్యాబ్ ఆవిస్కృతమైంది. ల్యాబ్ సక్సెస్ కావడంతో ఆ కళాశాలలో బుధవారం విజయోత్సవ వేడుక నిర్వహించారు.ఈ సందర్భంగామాట్లాడుతూ ఇన్నోవేషన్ అంటే… కేవలం సిద్ధాంతాన్ని మాత్రమే కాదు, అనుభవంతో కూడిన పరిష్కారాలను రూపొందించడంలో తమ విద్యార్థులు సక్సెస్ అయ్యారన్నారు. ఈ ల్యాబ్ ద్వారా నైపుణ్యాలను అభివద్ధి చేసుకోవచ్చన్నారు. వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకొని, అనేక సాంకేతిక సమస్య లకు ఆవిష్కరణాత్మక పరిష్కారాలు ఇక్కడి ల్యాబ్‌లో లభించేలా రూపొం దించడం అభినందనీ యమన్నారు. ఈ ల్యాబ్‌లో విద్యార్థులు విభిన్నమైన ప్రాజెక్టులపై పనిచేశారు. కొంత మంది విద్యార్థులు స్మార్ట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్, ఇంకొందరు గ్రామీణ మౌలిక వసతులపై ఆధారిత డిజిటల్ సొల్యూషన్‌లను రూపొందించారన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు నూతన ఆలోచనలకు దారి తీసేలా ఉన్నాయన్నారు. విజయోత్సవ వేడుకల్లో అధ్యాపకులు, మెంటార్లు నూతన ఆవిష్కరణలకు తమ మద్దతు తెలిపారు.
