ల్యాబ్ టెక్నిషియన్స్ సమస్యలు పరిష్కరించాలి 

Mar 13,2025 15:59 #nandyala

ప్రజాశక్తి – కొత్తపల్లి : ప్రజారోగ్యంలో ప్రధాన పాత్ర రోగనిర్ధారణ విభాగానికి సంబంచిన ల్యాబ్ టెక్నీషియన్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని నంద్యాల జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షులు డి. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో ల్యాబ్ టెక్నీషియన్లు గా పనిచేస్తున్న టెక్నీషియన్ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలన్నారు. వైద్యశాలలకు వచ్చిన ప్రతి రోగికి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే పరీక్షా ఫలితాన్ని బట్టే వైద్యులు చికిత్స అందిస్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ క్యాడర్ విషయంలో ప్రభుత్వాలు వారి సమస్యల పరిష్కార విషయంలో చొరవ చూపలేదు అన్నారు .వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగంలో ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ 2 గా చేరి ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ 2 గానే పదవి విరమణ కావడం జరుగుతుంది అన్నారు. 10 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆ దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు చేయలేకపోయి అని ఆయన  విమర్శించారు. వైద్యశాలల్లో ల్యాబ్ టెక్నిషియన్స్ కు సమాన పనికి సమాన వేతనం వర్తింప చేయాలి అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొనసాగిస్తూ మిగిలి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలి అన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరించి ల్యాబ్ టెక్నీషియన్స్ కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు.

➡️