లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షకులకు వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన చట్టాలను రద్దు చేయాలని సిఐటియు, ఎఐటియుసి నాయకులు డిమాండ్‌ చేశారు. కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధ వారం దేశవ్యాప్తంగా అఖిలపక్ష కేంద్ర కార్మిక, రైతు సంఘాలు పిలుపు మేరకు స్థానిక రాయచోటిలో మున్సిపల్‌ కార్యాలయం నుండి ప్రభుత్వాసుపత్రి వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా సిఐటియు, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్య దర్శులు ఎ.రామాంజులు, ఎం. సాంబశివలు, సిఐటియు జిల్లా కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపట్టి నుంచి కార్పొరేట్‌ ప్రయోజనాలకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చాలని ప్రయత్ని స్తుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను 4 లేబర్‌ కోడ్స్‌గా మార్పు చేసిందన్నారు. ఈ కోడ్స్‌ అమలు జరిగితే కార్మికులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. సంఘం పెట్టుకొనే హక్కు, సమ్మె చేసే హక్కు, యజమానులతో జీతభత్యాలు బేరం ఆడే హక్కు వంటివి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ లేబర్‌ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేసే మానిటైజేషన్‌ ఆఫ్‌ పైప్‌ లైన్‌ రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసి కనీస పెన్షన్‌ రూ.9 వేలకు తక్కువ లేకుండా చెల్లించాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బివి.రమణ, రాంబాబు ఈశ్వర్‌రెడ్డి, నాగమణి, సుమలత, అరుణ, భూదేవి, పద్మజ, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు, కార్యదర్శి పి.ఎల్‌.నర్సింహులు, సురేష్‌ కుమార్‌, సిపిఐ సహయ కార్యదర్శి మహేష్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కేశవరావు, హరి, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమళ్ళ రంగారెడ్డి, ఎఐటియుసి రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి బత్తల రమణ, రెడ్డిశేఖర్‌ పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్‌ : కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక పేదలను దగా చేసే బడ్జెట్‌ను వ్యతిరికిం చాలని సిపిఎం జిల్లా కన్వీనర్‌ పి.శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. పట్టణంలోని హెడ్‌ పోస్టాఫీస్‌ ఎదురుగా, అనిబిసెంట్‌ సర్కిల్‌లో ఎపి రైతు, వ్యవసాయ, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన, రాస్తారోకో చేపట్టారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌, లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కదిరి రోడ్డు, బెంగళూరు రోడ్డులపై ట్రాఫిక్‌ స్తంభించింది. ట్రాఫిక్‌ సిఐ మోహన్‌ కుమార్‌ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరామింప చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌, ప్రజలను దగా చేసేదిగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి భారీగా కోతలు విధించారని, దీని వలన వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు భారీగా నిధులు తగ్గించడం అన్యా యమన్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేసే విధంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారే తప్ప, ఏ రంగానికి, అభివద్ధికి నిధులు బడ్జెట్లో కేటాయిం చలేదని విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి.ప్రభాకర్‌రెడ్డి, బికెఎంయు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప, ఐటియుసి నాయకులు కృష్ణమూర్తి, సిఐటియు నాయ కులు నారాయణ, పవన్‌, రాజశేఖర్‌, రెడ్డిప్రసాద్‌, చాంద్‌ బాషా, రామ కృష్ణ, చలపతి నాయుడు, రాజు, శంకర్‌ నాయక్‌, నరసింహులు, నవాజ్‌, ఎఐటి యుసి నాయకులు కృష్ణప్ప, తిరుమల, ముబారక్‌, నాగరాజు, పథ్వి పాల్గొన్నారు. సుండుపల్లె : గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్‌ ప్రయోజనాలకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చాలని ప్రయత్నిస్తుందన్నారు. కార్యక్ర మంలో సిఐటియు నాయకులు ఓబులేసు, శరమంద, నాగేంద్ర, ఆనంద్‌, కష్ణయ్య, రామసుబ్బమ్మ, యల్లమ్మ, ఓబుళమ్మ పాల్గొన్నారు. చిన్నమండెం: బిజెపి అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్ష కార్మిక, రైతు సంఘాలకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమణ, నాయ కులు రెడ్డెమ్మ, మేరీ, సులోచన, శ్రీలత, సిద్దమ్మ, మునీరా, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. రైల్వేకోడూరు: లేబర్‌ కోడ్లను రద్దు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్‌ విగ్రహం మీదుగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌. చంద్రశేఖర్‌, మండల అధ్యక్షులు పుల్లయ్య, కార్యదర్శి, జాన్‌ ప్రసాద్‌, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి, నాయకులు యానాదయ్య, పెంచలయ్య, సుజాత, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు లతీఫ్‌ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : పురపాలక కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికుల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, నాయకులు ఈశ్వరమ్మ, మున్సిపల్‌ కార్మికులు సురేష్‌, ప్రసాద్‌, లక్ష్మీదేవి, సారమ్మ, బాలాజీ పాల్గొన్నారు.

➡️