వినుకొండ: కార్మికులందరూ ఐక్యంగా ముందుకు వెళ్లి వారి హక్కులను పోరాటాల ద్వారా సాధించుకోవాలని సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంత్ రెడ్డి కోరారు. పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఆదివారం కార్పెంటర్ యూనియన్ ఏర్పాటుకు సన్నాహక సమావేశం షేక్ ఖాదర్ బాషా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కార్మికులు వారి సమస్యలను పరిష్కరించు కోవాలన్నా, ప్రభుత్వ నుండి కార్మికులకు అందవలసిన రాయి తీలను సాధించుకోవాలన్నా యూనియన్ ద్వారానే సాధ్యమవుతుందని, కార్పెంటర్ కార్మికులం దరూ ఐకమత్యంతో కలిసిమెలిసి పనిచేయాలని కోరారు. కార్పెంటర్ యూనియన్ నూతన కమిటీ ఎన్నికలు 30న ఏర్పాటు చేసేందుకు సభ్యులందరూ నిర్ణ యించుకున్నారు. సిఐటియు వినుకొండ టౌన్ గౌర వాధ్యక్షుడు బొంకూరు వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కోశాధికారి అంగల కుదురు ఆంజనేయులు, సిద్ధి వెంకటరావు , చోడ వరపు జగదీష్, కంచర్ల సుబ్రమణ్యం, పప్పూరి వెంక టప్పయ్య, సిద్ధి భూషణం, గోవిందరాజులు తది తరులు పాల్గొన్నారు.
