11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు : ఏవో లక్ష్మి లావణ్య

Nov 27,2024 17:34 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : మండల పరిధి గ్రామాల్లో ఇప్పటివరకు 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మండల వ్యవసాయ అధికారిని ఎస్.లక్ష్మీ లావణ్య తెలిపారు. ఇందులో భాగంగా మండలంలోని జొన్నాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె బుధవారం సందర్శించారు. అలాగే తుఫాను హెచ్చరిక ఉన్నందున ఇంకా కోతలుకోయని రైతులు డిసెంబర్ 2 వరకు వాయిదా వేసుకోవాలని కోరారు. అలాగే కోసి ఆరబోసి వబ్బిడి చేసినవారు దగ్గర్లో ఉండే మిల్లులకు పంపించుకుని ధాన్యం సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ ధాన్యం కొనుగోలులో సమస్యలు ఏమైనా ఉంటే వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల దృష్టికి తీసుకురావాలని క్షేత్రస్థాయిలో అధికారులందరూ అందుబాటులో ఉంటామన్నారు. మండలంలో 9,350 ఎకరాలలో ఉన్న వరికి గాను 7,500 ఎకరాలలో వరి కోత పూర్తయిందన్నారు.

➡️