కుటుంబ వివాదాలతోనే భూ సమస్యలు

Dec 7,2024 01:25

ముప్పాళ్ల మండలం గోళ్లపాడు సదస్సులో అర్జిదార్ల సమస్యలు వింటున్న కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు
ప్రజాశక్తి-ముప్పాళ్ల :
కుటుంబ వివాదాల కారణంగా భూసమస్యలు పరిష్కారం కావడం లేదని, వాటిని సరిచేసుకుంటే అర్జీల పరిష్కారం సులభతరం అవుతుం దని పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మండలంలోని గోళ్లపాడులో తహశీల్దార్‌ భవానీశంకర్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సభలో కలెక్టర్‌ మాట్లాడారు. కోర్టు కేసులు, ఇతర వివాదాల్లేని ప్రతి అర్జీనీ పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ఏళ్ల తరబడి చిన్నచిన్న కారణాలతో రైతులు, పేదలు భూ వివాద సమస్యలతో చితికి పోతున్నారన్నారని చెప్పారు. ఇలాంటి వాటికి రెవెన్యూ గ్రామ సదస్సులు పరిష్కార వేదికలు కావాలన్నారు. సభలో వచ్చిన ప్రతి అర్జీకీ రసీదు ఇచ్చి గడువులోగా పరిష్కరించాలన్నారు. సర్పంచ్‌ జి.అప్పమ్మ, ఎంపీడీవో పి.జె విలియమ్స్‌, డిప్యూటీ తహశీల్దార్‌ లక్ష్మీప్రసాద్‌, ఈవోపిఆర్డీ రూపావతి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – వెల్దుర్తి : మండల కేంద్రమైన వెల్దుర్తి సచివాలయంలో సభ నిర్వహించగా పల్నాడు జిల్లా జెసి సూరజ్‌ గొనెరె హాజరయ్యారు. భూమి కొనుగోలు సమయంలో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేయించుకుంటే భూ సమస్యలు ఉత్పన్నం కావన్నారు. సదస్సుకు 17 అర్జీలు రాగా వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించి పరిష్కరిస్తామని జెసి చెప్పారు. మండల ప్రత్యేకాధికారి జగదీశ్వర్‌రెడ్డి, తహశీల్దార్‌ షేక్‌ బాషా, ఎంపీడీవో ప్రసాదరావు, ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ బాబు నాయక్‌, ఆర్‌ఐ మస్తాన్‌వలి, ఈవోపీఆర్డి మకట్‌లాల్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – కారంపూడి : నరమాలపాడులో సభ నిర్వహించగా ఎమ్మెల్యే జూలకంటి. బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు. తొలుత అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. తహసీల్దార్‌ పుల్లారావు, టీడీపీ నాయకులు పి.పుల్లయ్య, పి.అంజయ్య, యు.లక్ష్మినారాయణ, ఎం.సత్యం పాల్గొన్నారు.
ప్రజాశక్తి – వినుకొండ : మండల కేంద్రమైన బొల్లాపల్లి సభలో ప్రభుత్వ చీఫ్‌విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడారు. రానున్న 3 నెలల్లో సర్వేలన్నీ పూర్తిచేసి ఎవరు ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో ఉన్నారో నిర్ణయించి పట్టాలివ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలపై లక్షా 74 వేల 720 అర్జీలు వస్తే అందులో 67,928 అర్జీలు రెవెన్యూకి సంబంధించే ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారం నేపథ్యంలో అధికారులెవరైనా అంచాల కోసం రైతులను ఇబ్బంది పెడితే కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించడంతోపాటు బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో మధులత, తహశీల్దార్‌తోపాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ఈపూరు : మండల కేంద్రమైన ఈపూరు సచివాలయం వద్ద సదస్సులో మండల ప్రత్యేకాధికారి, జిల్లా ఉద్యాన శాఖాధికారి సిహెచ్‌ వెంకటరమణారెడ్డి, తహశీల్దార్‌ ఎ.నళిని మాట్లాడారు. రీ సర్వే, ఆన్‌లైన్‌లో పేర్ల నమోదు, వారసత్వపు భూ హక్కు, ఇతరత్రా భూ సమస్యలపై అర్జీలు అందజేస్తే నిర్ణీత సమయంలో పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. అనంతరం గ్రామస్తులు 12 అర్జీలను అందజేశారు. తొలుత అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సర్పంచ్‌ పి.చెంచయ్య, ఎంపీడీవో కె.ప్రభాకరరావు, వీఆర్వో వెంకటేష్‌, టిడిపి నాయకులు ఆర్‌.జగ్గారావు, టి.బాలయ్య, జి.శ్రీనివాసరావు, ఆర్‌.మురళి, సుబ్బారావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – పెదకూరపాడు : చినమక్కెనలో సభ నిర్వహించగా తహశీల్దార్‌ దానియేలు మాట్లాడారు. ఈ స,ంర్భంగా 27 అర్జీలు రాగా వీటిల్లో 23 అర్జీలు కొలతలకు సంబంధించినవి ఉన్నాయి. తొలుత స్థానిక ఎస్టీ కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట మండలం దొండపాడులో సభ న్విహించగా గామ ప్రత్యేకాధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ. మురళి, ఎంపిడిఒ టివి కృష్ణకుమారి, తహశీల్దార్‌ కె.వేణుగోపాలరావు, మండల వ్యవసాయ శాఖ అధికారి వి.నరేంద్రబాబు పాల్గొన్నారు. భూముల వెబ్‌ల్యాండ్‌, రీ సర్వేలో అవకతవకలపై ఫిర్యాదులు వచ్చాయి.
ప్రజాశక్తి – నాదెండ్ల : సాతులూరులో సదస్సు నిర్వహిం చగా 8 అర్జీలు వచ్చాయి. పట్టాదారు పాసుపుస్తకాల కోసం 5, పొలం కొలతల కోసం 3 అర్జీలు వచ్చినట్లు తహశీల్దార వి.రమణ తెలిపారు. సర్పంచ్‌ ఎం.శోభారాణి, టిడిపి నాయకులు బి.సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️