లేట్ బర్త్ సర్టిఫికెట్లను ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మంజూరు చేయాలి

Nov 19,2024 18:17 #srinivas

ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆఫర్ ఐడి క్రియేట్ చేయడం కోసం స్కూల్ రికార్డ్స్, ఆధార్ అన్నింటిలోనూ ఒకే విధంగా ఉండాలని చెప్పడంతో ఆధార్లో విద్యార్థులు మార్పులు చేర్పులు చేసుకోవాలంటే బర్త్ సర్టిఫికెట్ పొందాలి. ఇప్పుడు ఆ బర్త్ సర్టిఫికెట్ పొందడం చాలా కాస్ట్లీ గా అయిందని, ఇబ్బందిగా గందరగోళంగా ఉందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని లేట్ బర్త్ సర్టిఫికెట్లను సచివాలయాల ద్వారా ఎంక్వైరీ చేయించి అందించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు చదువుకోకపోవడం కొంతమంది చదువుకొని గతంలో పంచాయితీ కార్యదర్శులు, అంగన్వాడి కేంద్రాల వద్ద బర్త్ రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ అవి ఆన్లైన్ కాకపోవడంతో, చాలా సచివాలయాల దగ్గర ఆ రిజిస్ట్రేషన్ చేసిన రికార్డులు అందుబాటులో లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు బర్త్ సర్టిఫికెట్లు అడగగానే మీవి ఆన్లైన్లో లేవు నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ తీసుకొని బర్త్ సర్టిఫికెట్ కావాలంటే ఆర్డిఓ ప్రొసీడింగ్స్ తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఆర్డీవో ప్రొసీడింగ్స్ తెచ్చుకోవడానికి విద్యార్థి సచివాలయంలో అప్లై చేసుకోవడానికి 110 నోటరీ అఫిడవిట్ చేయించడానికి, 180 బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ శాఖకు ,నాన్ అవైలబిలిటీ కోసం 50 కట్టాల్సి రావడం స్కూల్ రికార్డ్స్ జిరాక్స్ అంగన్వాడీ కేంద్రాల్లో బర్త్ కన్ఫర్మేషన్, తీసుకొస్తేనే వీఆర్వోలు రిపోర్ట్ రాస్తామని చెబుతున్నారు. వీఆర్వోలు, ఆర్ ఐ, తాసిల్దార్ రిపోర్టు రాసి తయారుచేసి కవరింగ్ లెటర్ తో ఆర్డిఓ ఆఫీస్ కు పంపాల్సి ఉంది. అసలే చదువుకోకుండా ఉండడం, పనుల కాలం కావడం పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సర్టిఫికెట్లు పొందడానికి ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరగడం ఇబ్బందికరంగా మారి మధ్యవర్తులను ఆశ్రయించడంతో వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తాసిల్దార్ కార్యాలయం తో మొదలుకొని ఆర్డిఓ కార్యాలయం వరకు లేట్ బర్త్ సర్టిఫికెట్ కావాలంటే మామూలు ఇచ్చిన వారికి లేదా అధికారులతో సంబంధాలు ఉన్నవారికి మాత్రమే ఆర్డీవో ప్రొసీడింగ్స్ వచ్చే పరిస్థితి ఉంది. సాధారణమైన ప్రజలు లేట్ బర్త్ సర్టిఫికెట్ పొందాలంటే చుక్కలు కనపడుతున్నాయి. కావున ప్రభుత్వం వెంటనే లేటు బర్త్ సర్టిఫికెట్ల విషయంలో చొరవచేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు తిరగకుండా మధ్యవర్తులను ఆశ్రయించి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే బర్త్ సర్టిఫికెట్లను మంజూరు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఎక్కడికి అక్కడ ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.

➡️