పంట నష్టాల అంచనాలో అలసత్వం

పంట నష్టాల అంచనాలో అలసత్వం

వర్షవిలయ బాధితులు ఆవేదన

ప్రజాశక్తి -సీలేరు: వర్షం, కొండచరియల విలయంలో ఇళ్లు, పంటభూములు సర్వం కోల్పోయిన తమవైపు అధికారులెవరూ కన్నెత్తి చూడడం లేదనిజీకే వీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ వలసపల్లి, మనసపల్లి, వలసగడ్డ కొత్తూరు, శాండికొరి, బూషి కొండ గ్రామాల బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల వరదలకు పంట పొలాలు పూర్తిగా కొట్టుకుపోయి తీవ్రంగా నష్టం వాటిల్లింది. వరదలు వచ్చి 15 రోజులు గడుస్తున్నా తమను ఆదుకునే చర్యలు గానీ, పంటనష్టాల అంచనాకు గానీ ఎవరూ రాలేదని ఆవేదన చెందుతున్నారు. తమపట్ల రెవెన్యూ అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, ఐటిడిఎ పిఒ అభిషేక్‌ స్పందించి తమ గ్రామాల్లో పంట, ఇతర ఆస్తి నష్టాలను అంచనా వేయించి తగు నష్టనివారణ చర్యలు చేపట్టాలని బాధితులు కిముడు. శిబో, మజ్జిగ గెన్ను, జిన్ని రాజారావు తదితరులు వేడుకుంటున్నారు.

వలసపల్లి మనసపల్లిలో వరదలకు కొట్టుకుపోయిన పంట పొలాలు

➡️