సిమెంటు రోడ్డుకు శంకుస్థాపన

ప్రజాశక్తి-దర్శి: కూటమి ప్రభుత్వంలో దర్శి రూపురేఖలు మారుస్తానని టిడిపి దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. సిఎం నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లు నిరంతరం ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం 50 రోజుల ప్రజా ప్రభుత్వంలో అనేక అద్భుతాలు ప్రజలకు ఆచరణలో చూపించగలిగారని అన్నారు. ప్రభుత్వం అంటే సేవ అని నిరూపించారని తెలిపారు. డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి గురువారం దర్శి పట్టణంలోని 12వ వార్డులో సిమెంటు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ మహేష్‌, మున్సిపల్‌ సిబ్బంది, దర్శి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌లు, కౌన్సిలర్లు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️