క్యాన్సర్ తో బాధపడుతున్న ఉపాధ్యాయునికి లేపాక్షి మండల ఉపాధ్యాయుల సహాయం

Jan 10,2025 17:00 #teacher

ప్రజాశక్తి – అనంతపురం : షేక్ ముస్తఫా అనే సెకండరీ గ్రేడ్ టీచర్ లేపాక్షి మండలం సి వెంకటాపురం నందు పని చేస్తున్నారు. 15 సంవత్సరాలు సేవలు అందించిన ఈ ఉపాధ్యాయురాలికి ఇటీవల లక్ష మందిలో ఒకరికి వచ్చేటువంటి కార్సినోమా క్లియర్ సెల్ క్యాన్సర్ ముక్కుకి సోకింది. దీనితో రోజుకు దాదాపుగా 15 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా ఇప్పటికే దాదాపుగా 20 లక్షల పైగా ఖర్చు భరించడం జరిగింది. తన ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఓబులాపురం, వెంకటాపురం గ్రామ వాస్తవ్యులు, లేపాక్షి మండలంలోని ప్రాథమిక ,ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు, ఎమ్మార్సీ స్టాఫ్ అందరూ కలిసి గౌరవ ఎంఈఓ 1 , నాగరాజు నాయక్ఎంఈఓ 2 కుళ్లాయప్ప ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయలు విరాళాలు సేకరించి ముస్తఫా కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ 1 శ్రీ నాగరాజు నాయక్ మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులందరూ తమంతకు తాము స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి ముస్తఫా ఆరోగ్యం బాగుపడాలని కోరుకోవడం జరిగిందని, ఇదేవిధంగా అందరూ ఐకమత్యంగా కష్టకాలంలో ఒకరికొకరు తోడు ఉండాలని తెలియజేశారు. అలాగే ముస్తఫా  ఆరోగ్యం త్వరగా బాగుపడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ ఖాన్, రియాజ్ ,తిమ్మయ్య, సాయినాథ్, రామలింగం, సురేష్, హిదాయితుల్లా ఖాన్ , శ్రీనివాస్ రెడ్డి ,రమణ,కిషారలింగేశ్వర,విజయ శేఖర్, రాందాస్ నాయక్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️