భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ‘ఉక్కు’ కోసం పోరాడదాం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, యువతకు రోల్‌ మోడల్‌ షహీద్‌ భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కు కోసం పోరాడదాం అని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ పిలుపునిచ్చారు. భగత్‌ సింగ్‌ 117వ జయంతి సందర్భంగా కడపలో ప్రభుత్వ ఐటిఐలో శనివారం భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివకుమార్‌ మాట్లాడుతూ యువతకు ఒక రోల్‌ మోడల్‌ అయినటువంటి ఒక ఆదర్శ మూర్తి భగత్‌ సింగ్‌ విగ్రహం కడపలో ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. భగత్‌ సింగ్‌ రగిలే ఒక నిప్పు కణిక అని, యువత ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. 23 సంవత్సరాల వయస్సులోనే దేశ స్వాతంత్య్రం కోసం ఊరి కొయ్యను ముద్దాడిన ధీరుడు భగత్‌ సింగ్‌ అన్నారు. ‘నా దేహం కన్నా దేశం గొప్పది’ అని నినదించిన త్యాగశీలి భగత్‌ సింగ్‌ అన్నారు. చిన్న వయస్సులోనే స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనే బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యోధుడు భగత్‌ సింగ్‌ అన్నారు. ఆయన పోరాటపటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. ప్రధానంగా ఆయన స్ఫూర్తితో యువత ఉద్యోగ, ఉపాధి కోసం పోరాటాలలో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. విభజన హామీలలో ప్రధానమైంది కడప ఉక్కు పరిశ్రమన్నారు. కరువుతో అల్లాడుతున్న వెనుకబడిన రాయలసీమలో వలసలు నివారణ జరగాలంటే ఉపాధి పరిశ్రమ ఏర్పాటే ప్రధాన లక్ష్యమన్నారు. అటువంటి కడప ఉక్కును కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదివాన్నారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన కడప ఉక్కు కేంద్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. ఇక్కడ చదువుకున్న యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసలు పోతున్నారని తెలిపారు. కడప ఉక్కు పై కేంద్రం శీతకన్ను వేసిం దన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం కడప ఉక్కు కోసం కేంద్రాన్ని నిలదీసిన సందర్భంగా ఏది లేదన్నారు. కడప ఉక్కు కోసం రాబోవు రోజులలో దీర్ఘకాలిక ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. యువత పోరాటాలలో కలసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌, నాజర్‌, బాలాజీ, గణేష్‌, పవన్‌, ఆదాం, సయ్యద్‌ మౌలాలి, జనార్ధన్‌ పాల్గొన్నారు. పిడిఎస్‌యు, పివైఎల్‌ ఆధ్వర్యంలో కడప నగరంలో పిడిఎస్‌యు రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో షాహిద్‌ భగత్‌ సింగ్‌ 117వ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పివైఎల్‌ జిల్లా యువజన నాయకుడు ముబారక్‌ బాష, పిడిఎఫ్‌ యు నగర నాయకులు గంగాధర్‌, మహేష్‌, చరణ్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. బద్వేలు : భగత్‌ సింగ్‌ 117వ జయంతి కార్యక్రమాన్ని డివైఎఫ్‌ఐ బద్వేల్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో భగత్‌ సింగ్‌ జయంతి వేడుకలను డివైఎఫ్‌ఐ మహిళా కో – కన్వీనర్‌ ఎస్‌.కె. ఫాతిమా ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనంలో భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాలవేసి మహిళలతో ఘన నివాళులర్పించారు. అలాగే పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో భగత్‌ సింగ్‌ విగ్రహానికి డివైఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మస్తాన్‌ షరీఫ్‌, ఆదిల్‌ ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా హాజరైన డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ 1907 సెప్టెంబర్‌ 28న లాయల్పూర్‌ జిల్లా బంగా గ్రామంలో జన్మించిన భగత్‌ సింగ్‌ లాలా లజపతిరాయి, మహాత్మా గాంధీ పిలుపులను అందుకొని భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. నేడు భగత్‌ సింగ్‌ కోరుకున్న సమ సమాజం కాకుండా మతోన్మాద రాజ్యం రావడం బాధాకరమని ఇలాంటి తరుణంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరా టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ బద్వేల్‌ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులు ఖలీల్‌ బాష, యువరాజ్‌, షబ్బీర్‌, పట్టణ నాయకులు మా పీర, చంద్రకళ, మాధవి, అరుణ, స్వీటీ పాల్గొన్నారు. పట్టణంలోని సిద్ధవటం రోడ్డులో ఆయన విగ్రహం వద్ద జయంతి ఉత్సవ కార్యక్రమం బద్వేలు పట్టణ అభివద్ది కమిటీ, మహనీయుల ఆశయాల సాధన కమిటీల ఆధ్వర్యాన భరత్‌ సింగ్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో నానబాల వెంకటేశ్వర్లు, యోగివేమన యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు, మహనీయుల ఆశయాల సాధన కమిటీ గౌరవాధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు, గురుమూర్తి, ఉపాధ్యక్షులు ఎస్‌.ఎ సత్తార్‌, సంజీవరెడ్డి, వెంకటరమణ, పట్టణ అభివద్ది కమిటీ కోశాధికారి వెంగళరావు, నాగార్జున, అల్లు మస్తాన్‌, రవి, నాగూర్‌ బాష పాల్గొన్నారు.భగత్‌ సింగ్‌ గొప్ప దేశ భక్తుడు : పిసిసి వేంపల్లె : దేహం కంటే దేశం మిన్న అని భావించి దేశం కోసం ప్రాణాలర్పించిన సర్దార్‌ భగత్‌ సింగ్‌ గొప్ప దేశభక్తుడని పిసిసి అధికార తులసిరెడ్డి కొనియాడారు. వేంపల్లెలో శనివారం సర్దార్‌ భగత్‌ సింగ్‌ 117 వ జయంతిని కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ చిత్ర పటానికి కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చెరసాల యోగాంజనేయులు నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సుబ్రమణ్యం, అమర్నాథ్‌రెడ్డి, ఉత్తన్న, సుబ్బరాయుడు, నాగరాజు, వినరు, పాల్గొన్నారు.భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో రక్తదాన శిబిరం ప్రజాశక్తి – ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు యువతకు రోల్‌ మోడల్‌ షహీద్‌ భగత్‌సింగ్‌ అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎద్దు రాహుల్‌, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్‌ రాజ్‌ పేర్కొన్నారు. భగత్‌ సింగ్‌ 117వ జయంతి సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ రక్తనిధి కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, భగత్‌సింగ్‌ బ్లడ్‌ డొనేట్‌ గ్రూప్‌ సభ్యులు కలిసి రక్తదానం చేశారు. అనంతరం భగత్‌సింగ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సురేష్‌, జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సభ్యులు రాజేష్‌, రోటరీ క్లబ్‌ సభ్యులు భారతి పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువత విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కు కోసం పోరాడదాం అని డివైఎఫ్‌ఐ జమ్మలమడుగు పట్టణ కార్యదర్శి తులసీశ్వర యాదవ్‌ పిలుపునిచ్చారు. భగత్‌సింగ్‌ 117 వ జయంతి సందర్భంగా శనివారం భగత్‌సింగ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మహేష్‌. శ్యామ్‌. కల్యాణ్‌ పాల్గొన్నారు.

➡️