‘మన ఊరు బడిని రక్షించుకుందాం’

Apr 11,2025 21:12

ప్రజాశక్తి – సీతానగం :  మన ఊరు బడిని రక్షించుకుందామని, మోడల్‌ స్కూల్లో ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధానం పేరుతో 3,4,5 తరగతులను విలీనం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. దీనివల్ల పేద విద్యార్థులను విద్యకు దూరం చేయమేనన్నారు. తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ఈ విద్యా విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో పాల్గొంటామన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు జి.వెంకటరమణ, బి.అప్పారావు, ఆర్‌.రాము, సిహెచ్‌ కృష్ణ పాల్గొన్నారు.

➡️