ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : సమాజంలో అవినీతి చీడపురుగులా మర్రి ఊడలవలే పాతుకుపోయిందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతలా స్వీకరించి కూకటి వేళ్ళతో అంతమొందించాలని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వై.అజరు ప్రభు కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని జన్నాడ యూనియన్ బ్యాంక్ ఖాతాదారులతో బ్రాంచ్ కార్యాలయంలో అవినీతిని నిర్మూలిస్తామంటూ సోమవారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మన దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పురోగతికి అవినీతి ఒక ప్రధాన అవరోధమని, ప్రభుత్వం, పౌరులు, ప్రైవేటు రంగం అందరూ అవినీతి నిర్మూలనకు కలసికట్టుగా కఅషి చేయాలన్నారు. ప్రతి పౌరుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ అన్ని సమయాల్లోనూ నీతి, సమగ్రతల అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ, అవినీతి వ్యతిరేక పోరాటానికి తప్పకుండా మద్దతు ఇవ్వాలన్నారు. అనంతరం బ్రాంచ్ సిబ్బందితో మేము లంచం పుచ్చుకోమని, పనులూ నిజాయతీతోను, పారదర్శకంగాను నిర్వహిస్తామని, ప్రజా ప్రయోజనాలు దఅష్టిలో ఉంచుకుని పని చేస్తామని, వ్యక్తిగత ప్రవర్తనలో కూడా సమగ్రత పాటిస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఉంటామని, అవినీతికి సంబంధించిన సంఘటనలేవైనా మా దఅష్టికి వస్తే సంబంధిత అధికారుల దఅష్టికి తెస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ క్యాషియర్ దేవిశ్రీ సత్య, భారత్, శాంతి, మస్తాన్, రామారెడ్డి, తమలంపూడి ఈశ్వరరెడ్డి, సత్తి తమ్మిరెడ్డి, మాజీ సర్పంచ్ చాపల రుతియ్య, పలువురు ఖాతాదారులు పాల్గొన్నారు.