ప్రజాశక్తి-రాయచోటి టౌన్ రాజకీయాలకతీతంగా రాయచోటి పట్టణ అభివద్ధికి కషి చేస్తామని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటి మున్సిపల్ కౌన్సిల్ సభా భవనంలో చైర్మన్ ఫయాజ్ బాషా అధ్యక్షతన జరిగిన రాయచోటి పురపాలక కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 110 రోజులు అయిందని రాష్ట్రాన్ని అభివద్ధి బాటలో నడిపించేందుకు కషి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం డిఎస్‌సితోపాటు పాటు ఇతర స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని దసరా నుంచి రాష్ట్రంలో పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వబోతున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళలకు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రభుత్వాలు, నాయకులు మారినా ప్రజలకు మంచి చేసే విధంగానే ఉండాలని అదే తమ నినాదం అన్నారు. రాజకీయాలకు అతీతంగా రాయచోటి పురపాలకలో అభివద్ధి పనులు చేపడుతామని చెప్పారు. ఇందుకు పురపాలక పాలకపక్షం సహకరించి ముందుకు వెళ్లాలన్నారు. అర్హులైన వద్ధులకు పెన్షన్లు, పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని పురపాలకలో గత పాలనలో వచ్చిన నిధులు ఎక్కడ వెచ్చించారో కూడా తెలియని పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. వెలుగల్లు నీటి పథకం ద్వారా పట్టణానికి తాగునీరు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కారానికి అధికారులు కషి చేయాలన్నారు. పట్టణంలో రెవెన్యూ స్థలాలను గుర్తించి కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చర్యలు తీసుసుకుంటామని చెప్పారు. రాయచోటి మార్కెట్ యార్డును పునరుద్ధరించడం, అన్ని వర్గాలకు సంబంధించి శ్మశాన వాటికల ఏర్పాటు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పట్టణంలో కుక్కల సమస్య ఉన్నట్లు దష్టికి వచ్చిందని, పరిష్కారానికి కూడా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాయచోటి పాత టౌను, మిగిలిన చోట్ల పాత విద్యుత్తు ఉన్నాయని వాటిని తొలగించి కొత్త పోల్స్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. రానున్న ఐదు సంవత్సరాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి కషి చేస్తామని, అందరి సహకారంతో రాయచోటి నియోజకవర్గాన్ని రానున్న ఐదేళ్లలో అభివద్ధి చేసి తీరుతానని ఆయన పేర్కొన్నారు. అంతకుముందుగా కౌన్సిల్ సమావేశంలో సభ్యులు వివిధ సమస్యలను మంత్రి దష్టికి తీసుకువచ్చారు. వాటన్నిటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు మంత్రి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాసు బాబు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.