క్రీడాకారులను ప్రోత్సహిద్దాం

Jan 11,2025 16:30 #Sports

ప్రజాశక్తి – ఆదోని : క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రతి ఏడాది టోర్నమెంట్ నిర్వహిస్తూ వారి క్రికెట్ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించుకునేందుకు దోహదపడుతున్నామని టోర్నమెంట్ ఆర్గనైజర్ ముజిబ్ అహ్మద్ తెలిపారు. ఆదోని మున్సిపల్ మైదానంలో రెండో రోజు టోర్నమెంట్ ను  బ్రాహ్మణ అర్చక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెల్లాల మధుసూదన్ శర్మ రెండో రోజు శనివారం ప్రారంభించారు. అంతకుముందు మున్సిపల్ మైదానంలో ఆయనకు శాలువాతో సత్కారం చేసి క్రీడాకారులను పరిచయం చేయించారు. ఈ సందర్భంగా ముజీబ్ అహ్మద్ మాట్లాడారు. ఈనెల 19 వరకు ఆదోని క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. 40 పైగా జట్లు నమోదు చేసుకున్నారన్నారు.  19వ తేదీన ఫైనల్ నిర్వహించి రన్నర్, విన్నర్ జట్లకు తాలూకా క్రికెట్ అసోసియేషన్ నాయకులు శ్రామికవేత్తలు రాజకీయ ప్రముఖుల చేత కప్పు, నగదు అందజేస్తామన్నారు. వెన్నెల మధుసూదన్ శర్మ మాట్లాడారు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించుకునేందుకు టోర్నమెంట్ నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులు ముజీబ్ అహ్మద్ సేవలు ప్రశంసనీయమని కొనియడారు. కార్యక్రమంలో వినోద్ రెడ్డి ,శీన, చంద్రశేఖర్ మారుతి తదితరులు ఉన్నారు.

➡️