సుందరయ్య ఆశయసాధనకు పోరాడుదాం

May 20,2024 23:47 #sundarayya vardanthi 2nd day
sundarayya Vardhanthi 2nd day

ప్రజాశక్తి -యంత్రాంగం పీడిత ప్రజల ప్రియతమ నేత, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు పోరాడుదాం అని పలు చోట్ల సభల్లో వక్తలు పిలుపునిచ్చారు. విశాఖలో పలుచోట్ల సోమవారం సుందరయ్య వర్థంతి సభలు నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాజువాక : పెదగంట్యాడ హౌసింగ్‌ బోర్డు కాలనీలోని సిడబ్ల్యూసిలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సభను నిర్వహించారు. ఈ సభలో సిపిఎం స్టీల్‌ జోన్‌ కార్యదర్శి పివిఎస్‌వి.శ్రీనివాసరాజు మాట్లాడుతూ, సమ సమాజం, దోపిడీ లేని సమాజం కోసం సుందరయ్య అహర్నిశలు కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం స్టీల్‌ జోన్‌ నాయకులు బి.గురప్ప, నమ్మి రమణ, స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్షులు జి.శ్రీనివాసరావు, నాయకులు డి.వెంకటరావు, పి.గురప్ప, కె.దీనబందు, పి.మసేను, కె.మల్లేశ్వరరావు, సిహెచ్‌.రాముడు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఆరిలోవ : నిస్వార్థ రాజకీయ నాయకుడు, దేశ రాజకీయాలకే వన్నెతెచ్చిన నేత సుందరయ్య అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్క్‌ వద్ద యూనియన్‌ ఆధ్వర్యాన వర్థంతిని నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి యూనియన్‌ నాయకులు వి.నరేంద్రకుమార్‌, రామారావు, నరేష్‌, నాగేశ్వరావు, పైడిరాజు తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుమార్‌ మాట్లాడుతూ, నేటి యువతరం సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహించాలన్నారు. నేటికీ, ఏనాటికీ సుందరయ్య రాజకీయాలకే ఆదర్శం అన్నారు. నేటి యువతరం ఆయన ఆశయాలకోసం కృషి చేయాలని కోరారు.విశాఖ కలెక్టరేట్‌ : సుందరయ్య ఆదర్శవంతమైన నాయకుడని, పార్లమెంటులో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకునిగా ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేశారని, నిజాయితీ నిబద్ధత కలిగిన అటువంటి రాజకీయ నాయకులను ఎన్నుకుంటే దేశం ప్రగతి మార్గంలో నడుస్తుందని ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారులు, మత్స్య కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌ అన్నారు. సుందరయ్య వర్థంతి కార్యక్రమాన్ని సోమవారం సింగ్‌ హోటల్‌ జంక్షన్‌ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కె.నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సింగనాయుడు సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేశారు. సభకు ఎం.సుబ్బారావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో నాయకులు పార్వతిదేవి, లక్ష్మి, రామారావు, ఈశ్వరరావు, సిమ్మన్న, అప్పన్న, శ్రీను, సిఐటియు జగదాంబ జోన్‌ కార్యదర్శి కెవిపి.చంద్రమౌళి పాల్గొన్నారు.పంది మెట్ట జంక్షన్‌లో.. సుందరయ్య వర్థంతి కార్యక్రమం పంది మెట్ట జంక్షన్‌లోనూ జరిగింది. ఐద్వా నాయకులు కె.మణి, బి.సత్యవతి, బి.సూరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️