వక్ఫ్ సవరణ బిల్లు వెనక్కి తీసుకునే వరకు పోరాడుదాం

Apr 11,2025 17:39 #Krishna district, #Waqf

ప్రజాశక్తి – మచిలీపట్నం అర్బన్ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు వెనక్కి తీసుకునే వరకు పోరాటం తీవ్రతరం చేస్తామని బీసీ సంఘం అధ్యక్షులు సొంటి నాగరాజు పేర్కొన్నారు. సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడ నుంచి బయలుదేరిన ర్యాలీ శుక్రవారం సాయంత్రం మచిలీపట్నం కోనేరు సెంటర్ కి చేరుకుంది. మచిలీపట్నంలో ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. గతంలో రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చుట్టాలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే వెనక్కి తీసుకుందో ఈ సవరణ బిల్లు కూడా వెనక్కి తీసుకునే వరకు మైనారిటీలంతా ఏకమై కేంద్రంతో పోరాడుదాం అన్నారు. బీసీ సంఘం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహమ్మద్ ఇబ్రహీం ఇలియాస్ ఆసిఫ్ పాషా మాట్లాడుతూ ఈ సవరణ బిల్లుతో ముస్లింల హక్కులను ప్రభుత్వం కాల రాయడానికి సిద్ధపడిందన్నారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న బిల్లు కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లింలు మైనారిటీలు అంతా ఐక్యమత్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలు పై ముస్లిం యువకులు పెద్దలు ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లి మోమరాండం సమర్పించారు. తొలుత మూడు స్తంభాల సెంటర్ కి వెళ్లి విజయవాడ నుంచి వచ్చే ర్యాలీకి మచిలీపట్నం ముస్లిం నాయకులు ఫిరోజ్ తదితరులు ఘన స్వాగతం పలికారు.

➡️