రా రండోయ.. వేడుక చూద్దాం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట విద్యుత్‌ దీపాలతో, ఆకాశమంత పందిళ్లతో కళకళలాడుతోంది. ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు యాత్రికులు ఒంటిమిట్ట చేరుకున్నారు. కళ్యాణశోభను ఒంటిమిట్ట సంతరించుకుంది. రామనామ స్మరణతో ఏకశిలానగరం మారుమ్రోగుతోంది. విఐపిల రాక, పోలీసుల బందోబస్తుతో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు నూతన శోభను సంతరించుకుంది. కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రానుండటంతో పోలీసులు అడుగడుగునా మోహరించి కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు.ప్రజాశక్తి – కడప ప్రతినిధి/ఒంటిమిట్టఏకశిలానగరిలో శుక్రవారం రాత్రి నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయం విద్యుత్‌ దీపపు ధగధగలతో దేదిప్యమానంగా ముస్తాబైంది. నబూతో నభవిష్యతి అనేరీతిలో విద్యుత్‌ కాంతుల మధ్య ఆకాశమంత చలువపందిళ్లతో కళకళ లాడు తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జగదబిరాముని కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు, యాత్రికులు, సేవకులు ఒంటిమిట్టకు చేరుకున్నారు. జగదభిరాముని ఆలయంలోని దత్తమండపం, ధ్వజస్తంభం, కల్యాణవేదిక విద్యుత్‌ కాంతులతో కల్యాణశోభను సంతరించుకుంది. ప్రభుత్వం తరుపున కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో రానుండడంతో నూతనశోభ చోటు చేసుకుంది. పలువురు మంత్రులు, విఐపిలు రానున్నారు. సుమారు రెండు వేల మంది పోలీసులు అడుగడుగునా మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజునాటికి కల్యాణ ఘడియలు సమీపించడంతో పలువురు భక్తులు, పర్యాటకులు, యాత్రికులు, సేవకులు కల్యా ణోత్సవాన్ని తిలకించేందుకు ఎదురు చూస్తున్నారు. ఒంటిమిట్ట గ్రామ శివారులోని కల్యాణ వేదిక, దత్తమండపం, కోదండ రామాలయం విద్యుత్‌ కాంతులతో శోభాయమానంగా ప్రకాశిస్తోంది. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అడుగడుగునా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గతానికి భిన్నంగా భారీఎత్తున ప్రత్యేక బారీకేడ్లను ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవాన్ని జయప్రదం చేయడానికి పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లను చేయడం గమనార్హం. శుక్రవారం రాత్రి చంద్రుని వెన్నెల్లో జరిగే కల్యాణోత్సవానికి పలువురు దాతలు అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సీతారాముల కల్యాణం అనంతరం టిటిడి యంత్రాంగం లక్షలాది మందికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేసింది.కల్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణ ఒంటిమిట్టలో శుక్రవారం జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పా రావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలం బ్రాలను గురువారం సమర్పించారు. 120 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, అర్చకులు శ్రావణ్‌ కుమార్‌ సమక్షంలో అందించారు. ఈ తలంబ్రాల కోసం మూడు నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ రా ష్ట్రాలకు చెందిన భక్తులు ఎంతో భక్తి భావంతో మూడు నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో 14 ఏళ్లుగా భద్రాద్రి రామునికి, మూడు ఏళ్లుగా అయోధ్యకి, 8 ఏళ్లుగా ఒంటిమిట్ట రామునికి కల్యాణోత్సవం సందర్భంగా అందజేస్తున్నామని కళ్యాణ అప్పారావు తెలిపారు.కల్యాణోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం : చైర్మన్‌ ఒంటిమిట్టలో శుక్రవారం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు చెప్పారు. చైర్మన్‌ టిటిడి, జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణంలోని పరిపాన భవనం మీటింగ్‌ హాల్‌లో చైర్మన్‌, ఇఒ జె.శ్యామలరావు, కడప జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, జెఇఒ వీరబ్రహ్మం, జెసి అదితి సింగ్‌, ఎస్‌పి ఇ.జి.అశోక్‌ కుమార్‌, సివిఎస్‌ఒ హర్షవర్థన్‌ రాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ఏకశిలానగరంలో శుక్రవారం జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణాన్ని టిటిడి, జిల్లా యంత్రాంగం సమన్వయంతో వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమం నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 147 గ్యాలరీలలో 60 వేల మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్‌, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టామని చెప్పారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కల్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టామన్నారు.గరుడ వాహనంపై సీతాపతిఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తుల ను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 9 గంటల వరకు జరగనుంది. భక్తులు అడు గడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శిం చుకు న్నారు. ఉదయం మోహినీ అలం కారంలో రాములవారు జగన్మోహ నాకా రుడిగా దర్శనమిచ్చారు. ఉదయం 7.30 గంటలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. కేరళ డ్రమ్స్‌, భక్తజన బందాలు చెక్కభజనలు, కోలా టాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శిం చుకు న్నారు. వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

➡️