కన్నారావు ఆశయాలకు పాటుపడదాం

May 16,2024 23:35 #Upplili kannarao vardhanthi
Upplili Kannarao vardhanthi

ప్రజాశక్తి-ఉక్కునగరం : సిఐటియు సీనియర్‌ నాయకుడు ఉప్పిలి కన్నారావు ఆశయాలకు పాటుపడదామని స్టీల్‌ జోన్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ పిలుపునిచ్చారు. కొండయ్యవలస సిడబ్ల్యుసిలో సిఐటియు అగనంపూడి ఏరియా కమిటీ ఆధ్వర్యాన ఉప్పిల కన్నారావు ప్రథమ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్‌ మాట్లాడుతూ, కన్నారావు మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన చేసిన పోరాటాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని తెలిపారు. నిర్వాసితుల ఆర్‌.కార్డు మార్చాలని, నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని నిరంతరం పోరాటం చేశారని గుర్తుచేశారు. నిర్వాసితుల సమస్యలపై 2008లో జరిగిన పోరాటంలో రెండు రోజులు పాటు జైలుకు వెళ్లారని తెలిపారు. అగనంపూడిలో సిఐటియును బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. స్టీల్‌ సిఐటియు అధ్యక్షులు వైటి.దాసు మాట్లాడుతూ, ఉప్పిలి కన్నారావు చేసిన పోరాటాల వల్ల నిర్వాసితుల్లో ఎంతోమందికి శాశ్వత ఉపాధి లభించిందన్నారు. బడుగు, బలహీన వర్గాల తరపున నిరంతరం పోరాటం చేశారని గుర్తుచేశారు. ఈ సభలో అగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బలిరెడ్డి సత్యనారాయణ, అలమండ శ్రీను, మడగల నర్సింగరావు, గోవిందరావు, అట్ట అప్పారావు, కరణం పైడిరాజు, గంగాధర్‌, చిత్త అబ్బాయి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️