మహాత్మ జ్యోతిరావు పూలే బాటలో నడుద్దాం

Apr 11,2025 16:39 #Kurnool, #Mahatma Jyoti Rao Phule

ప్రజాశక్తి – కర్నూలు జిల్లాపరిషత్ : మహాత్మ జ్యోతిరావు పూలే బాటలో నడుద్దాం అని కురువ సంఘం నాయకులు అన్నారు. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ జయంతి సందర్భంగా కర్నూలు నగరంలోని బిర్లా గేట్ సర్కిల్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కే. రంగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, జిల్లా కురువ మహిళా సంఘం అధ్యక్షురాలు టీ. శ్రీలీల, జిల్లా నాయకులు పెద్దపాడు పుల్లన్న పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడే నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు.

➡️