ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు జాతీయ స్థాయి పిలుపులో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేఖలు రాశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, ఐసిడిఎస్‌కు నిధులు పెంపు, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని లేఖలో కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు కెపి.మెటిల్డాదేవి, జి.మల్లీశ్వరి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగక అంగన్వాడీలు ఇబ్బందులు పుగున్నారని, మాత, శిశు సంరక్షణకు విశేష సేవలందిస్తున్న వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ట్రెజరర్ ఎ.లక్ష్మీప్రసన్న, సాయికుమారి, సుజాత, శ్రీదేవి, పద్మావతి, అమల పాల్గొన్నారు.
