సాగుదారులకు విముక్తి కల్పించండి

Jun 10,2024 21:19

 ప్రజాశక్తి- గజపతినగరం : ఆగూరు పంచాయతీకి సంబంధించిన కొంతమంది గిరిజన రైతులకు అక్రమ రుణదారుల నుంచి విముక్తి కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాకోటి రాములు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం గజపతినగరం డిసిసిబి మేనేజర్‌కు ఆయన ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘంవలస, కింద గూడెం గ్రామానికి చెందిన గిరిజన రైతులు రిజర్వుడ్‌ ఫారెస్ట్‌ భూములను తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. మెంటాడ మండలానికి చెందిన న్యాయవాది బండారు సంజీవరావు కుటుంబ సభ్యులు ఒకప్పటి తహశీల్దార్‌ దూసి రవి సహాయంతో నకిలీ పత్రాలు సృష్టించి డిసిసిబి బ్యాంకు నుంచి రూ.15 లక్షలు రుణం తీసుకున్నారని ఆరోపించారు. దయచేసి భూమి వద్దకు వచ్చి తనిఖీ చేసి తమకు న్యాయం చేయాలని గిరిజన రైతులు కోరారు.

➡️