ప్రజాశక్తి – కపిలేశ్వరపురం : మండల కేంద్రమైన కపిలేశ్వరపురం శాఖ గ్రంధాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. శాఖ గ్రంథాలయ సంస్థ అధికారిణి డి శివకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈఓ కె.తాతారావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని వాటిని పాఠశాల విద్యార్థులు ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు . జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎంవంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయాలను ఉపయోగించుకుని విజ్ఞానవంతులు కావాలన్నారు . గ్రంథాలయ అధికారి డి శివకుమారి మాట్లాడుతూ గ్రంథాలయంలో నిర్వహించే వ్యాసరచన ,చిత్రలేఖనం , జనరల్ నాలెడ్జ్, రంగవల్లులు, తదితర పోటీల్లో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు .పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు వారోత్సవముల ముగింపు లో బహుమతులు, ప్రశంసా పత్రములు అందజేయడం జరుగుతుందని శివకుమారి తెలిపారు. తొలిత నెహ్రూ చిత్రపటానికి, గాంధీ విగ్రహానికి ,పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం వి శ్రీనివాస్ , వివేకానంద ప్రిన్సిపాల్ చిట్టూరి నాగేంద్ర ప్రసాద్, సచివాలయ సోషల్ వెల్ఫేర్ ఎస్ సతీష్, రిటైర్డ్ ఉపాధ్యాయులు చిట్టూరి సత్యనారాయణ, పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.