ప్రజాశక్తి – కడప అర్బన్ దేశంలోని 18-45 సంవత్సరాల వయసున్న యువత అవస రాలకు అనుగుణంగా ఎల్‌ఐసి కొత్తగా యువ టర్మ్ పాలసీ, యువ డిజి టర్మ్ పాలసీ, యువ క్రెడిట్ లైఫ్ పాలసీ, యువ డిజీ క్రెడిట్ లైఫ్ పాలసీలను మంగళవారం ప్రారంభించిందని కడప సీనియర్ డివిజనల్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. మంగళవారం ఎల్‌ఐసి కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌లో తొలిరోజే అన్ని బ్రాంచిలలో, సాటిలైట్ ఆఫీసుల్లో మంచి స్పందన లభించిందన్నారు. ఈ పాలసీలను టర్మ్ పాలసీలుగా, క్రెడిట్ లైఫ్ (మార్టగేజ్) పాలసీలుగా అందిస్తున్నామని చెప్పారు. తక్కువ ప్రీమియంతో, రూ.5 కోట్ల గరిష్ట బీమా మొత్తంతో ఆన్‌లైన్, ఆఫ్ లైన్ పద్ధతిలో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రీమియం చెల్లింపు వ్యవధి 15 ఏళ్ల నుంచి, 40 సంవత్సరాల వరకు ఎంచు కోవచ్చని అన్నారు. గరిష్ట మెచూరిటీ వయసు 75 ఏళ్లకు మించరాదని అన్నారు. సింగిల్ ప్రీమియం, సంవత్సర, అర్ధ సంవత్సర కంతుల్లో ప్రీమియం చెల్లించవచ్చని పేర్కొన్నారు. నేటి యువత ఇఎంఐలు కడుతూ హౌస్ లోన్, కార్ లోన్ తీసుకోవడం పరిపాటిగా మారిందని వీరికి ఈ పాలసీలు కొలాటరల్ సెక్యూరిటీగా పనికొస్తాయన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ శ్యామ్ సుందర్ రావ్, సేల్స్ మేనేజర్ సాల్మన్ రాజు, ప్రోడక్ట్ మేనేజర్ రామకష్ణ, ఇతర మేనేజర్లు సత్య ప్రసాద్, రాము నాయక్, సంఘాల ప్రతినిధులు చంద్రపాల్ , రఘునాథ రెడ్డి పాల్గొన్నారు.
