ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ మాదక ద్రవ్యాల వినియోగం వలన జీవితం అధోగతి పాలతుందని ఎస్‌పి విద్యాసాగర్ నాయుడు విద్యార్థులకు సూచించారు. బుధవారం మాదకద్రవ్యాలకు వ్యతి రకంగా అన్నమాచార్య యూని వర్సిటీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నమాచార్య యూని వర్సిటీ రజతో త్సవాలలో భాగంగా రెండవ రోజు బుధ వారం ఉదయం సే నో టు డ్రగ్స్-వాక్ అగైనెస్ట్ డ్రగ్స్ పేరిట భారీ ర్యాలీ నిర్వహిం చారు. ఈ ర్యాలీ ప్రారంభో త్సవంలో ఎస్‌పితో పాటు విసి డాక్టర్ చొప్పా గంగిరెడ్డి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ విద్యా ర్థులు డ్రగ్స్, ఇతర మాదకద్ర వ్యాలకు బానిస కాకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ప్రాంగణం నుంచి పట్టణం కొత్త బస్టాండ్ మీదుగ పాతా బస్టాండ్ వరకు ఐదు కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. రాజంపేట పాత బస్టాం డ్ వద్ద మానవహారంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు ప్రముఖ సినీ నటులు, వ్యక్తిత్వ వికాస శిక్షకులు కెవి.ప్రదీప్ విద్యార్థులను తన ప్రేరణ ప్రసంగంతో ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో డిఎస్‌పిఎన్. సుధాకర్, అన్నమాచార్య యూనివర్సిటీ అన్నమ య్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సి.రామ చంద్రారెడ్డి, ట్రస్ట్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ప్రోఛాన్సలర్ అభిషేక్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ఎం.వి.నారా యణ, రిజిస్టార్ డాక్టర్ ఎన్.మల్లిఖా ర్జునరావు, యోనో ఎస్‌బిఐ రాజంపేట రీజనల్ మేనేజర్ మురళి, డీన్‌లు, హెచ్‌ఒడిలు, అధ్యాపకుల, భారీగా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/Untitled-4-copy-2.jpg)