ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : గుడ్లవల్లేరు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాలు మంగళవారం నిర్వహించారు. లయన్ బొప్పన శివప్రసాద్, వల్లభనేని రామకఅష్ణ ఆర్ధిక వితరణతో మండలంలోని పెంజెండ్ర గ్రామంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరం లో 62 పశువులకు 30 గొర్రెలకు పశు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం 10 వేల రూపాయల విలువగల మందులు ఉచితముగా పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు నిమ్మగడ్డ శశికళ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ వైపిసి ప్రసాద్, లయన్స్ సభ్యులు సూరపనేని పరంధామయ్య, పోలవరపు వెంకట్రావు, వల్లభనేని వెంకట సుబ్బారావు,పశు వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.