జన నివాసాల్లో ఉన్న మద్యం షాపులు తొలగించాలి : మున్సిపల్‌ చైర్మన్‌ సావు

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : జన నివాసాల్లో ఏర్పాటు చేసిన మద్యం షాపులను వేరే ప్రాంతానికి తరలించాలని మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ కోరారు. మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ … పట్టణంలో నిత్యం జనంతో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పక్కనే మద్యం షాపులు ఏర్పాటు చేయడం వలన ప్రమాదాలు జరగడంతో పాటు యువత మద్యానికి ఆకర్షణకు గురై అలవాటు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. రోడ్డుపక్కన జన నివాసాల మధ్యలో ఏర్పాటు చేసిన మద్యం షాపులను వేరే ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ అధికారులను కోరారు. ఆయనతో కౌన్సిలర్లు ఇంటి గోవింద్‌, ఎస్‌.బాబు, వైసీపీ నాయకులు రాజగోపాల్‌ ఉన్నారు.

➡️