యాత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంగటి రాము
ప్రజాశక్తి-ఆనందపురం: గీత కార్మికులకు మద్యం షాపులను కేటాయించి ఆదుకోవాలని యాత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, గీత ఉప కులాల కన్వీనర్ ఆంగటి రాము కోరారు. గురువారంభీమిలి నియోజకవర్గం కల్లుగీత సహకార సంఘాల అధ్యక్షులతో ఆనందపురం కల్యాణ మండపలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, వైసిపి పాలనలో గీత కార్మికులకు సంక్షేమ పథకాలు అందక తీరని అన్యాయం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపులో గీత కార్మికులకు వాటా ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇటీవల నీటి సంఘాల ఎన్నికలలోకాపులప్పాడ నీటి చానల్ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గండిబోయిన రమణ, గొలుసు శ్రీను, శ్రీశైలం, రాష్ట్ర నాయకులు హరి ప్రసాద్ ఘనంగా సన్మానించారు. రాష్ట్ర నాయకులు చిట్టిబోయిన రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రీసు రమణ, గండి బోయిన రమణ, కాకర ఎల్లారావు, హరి ప్రసాద్, కొలుసు శ్రీను, గండిబోయిన సత్యం, సంఘాల అధ్యక్షులు మెంబర్లు పాల్గొన్నారు