మద్యాన్ని నియంత్రించాలి.. మహాత్ముని కలలు నిజం చేయాలి : ఐద్వా-సిఐటియు

కళ్యాణదుర్గం (అనంతపురం) : కళ్యాణదుర్గం పట్టణంలో నేడు మహాత్మా గాంధీ 155 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించాలని మహాత్ముని కలలను నిజం చేయాలని కోరుతూ … వినతిపత్రం అందజేసి ఐద్వా , సిఐటియు నాయకులు, అంగన్వాడీలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) డివిజన్‌ కార్యదర్శి లత మాట్లాడుతూ … రాష్ట్రంలో నూతనంగా తీసుకొన్న మద్యం పాలసీ లతో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది ప్రధానంగా మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు అన్ని కూడా చూస్తే మద్యానికి బానిసలై ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని అనేక సందర్భాలలో వాస్తవాలను చూశాం. మద్యపానం రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మకుండా నియంత్రించాలి. ఆదాయం కోసం కాకుండా మహిళలకు రక్షణ వుండేలా మద్యపానాన్ని నియంత్రించి ప్రభుత్వమే అమ్మేవిధంగా చర్యలు తీసుకోవాలి. సమయాన్ని కూడా తగ్గించి మద్యాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగనవాడీ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి పాతక్క,అంగనవాడీలు లక్ష్మీ, తులసి, పద్మా, భారతి, తదితరులు పాల్గొన్నారు.

➡️