అర్హులకు రుణాలు మంజూరు చేయాలి

ప్రజాశక్తి-చీమకుర్తి: అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరు వేగవంతం చేయాలని మున్సిపల్‌ కమీషనర్‌ వై.రామకృష్ణయ్య పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టౌన్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలుపరిచే వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు రుణాలు త్వరితగతిన మంజూరు చేయాలని తెలిపారు. వీధి వ్యాపారులకు, పిఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి త్వరగా రుణాలు మంజూరు చేయాలని కోరారు. పొదుపు సంఘాలకు రుణాల గురించి బ్యాంకర్లను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత యూనిట్లు నెలకొల్పే వారికి స్వయం ఉపాధి పథకం ద్వారా వడ్డీ రాయితీతో బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న అన్ని రుణాలు రికవరీలో పూర్తి సహకారం అందించాలని, తీసుకున్న రుణాలు సక్రమంగా బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సిటీ మిషన్‌ మేనేజర్‌ కె.రఘు, స్టేట్‌ బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ సునీత, ఆంధ్రప్రగతి బ్యాంకు ఫీల్డు ఆఫీసర్‌ మదన్‌, కోఆపరేటివ్‌ బ్యాంకు మేనేజర్‌ సంపత్‌ కుమార్‌, కమ్యూనిటీ ఆర్గనైజర్‌ పి.రాజేశ్వరి, డిఈఓ చిరంజీవి, అఖిల పాల్గొన్నారు.

➡️