రిక్షాలను అందిస్తున్న కలెక్టర్ అరుణ్‌బాబు తదితరులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : చెత్తను సేకరణ ద్వారా జీవనం సాగిస్తున్న వారు ఆ పని మానుకొని ఇతర పనుల్లో జీవనోపాధిని చూసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావు సూచించారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో సమకూర్చిన రిక్షాలను నరసరావుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన ఇద్దరు వేస్ట్ పిక్కర్స్‌కు కలెక్టర్, ఎస్‌పి మంగళవారం అందించారు. పిల్లలను కూడా చెత్త సేకరణ పనులకు కాకుండా బడికి పంపించాలన్నారు. ప్రాథమిక స్థాయి నుండి పై చదువుల వరకు ఉచితంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువు అందుతుందని, పిల్లలు బాగా చదివితే జీవితాన్ని ఉన్నతంగా మలచుకోవచ్చని, మీ జీవితాలు మారతాయని చెప్పారు. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపితే అక్కడ పౌష్టికాహారం అందుతుందని, ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. పిల్లలన్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ మురళి, ఆర్‌డిఒ కె.మధులత, డిబిఆర్‌సి నరసరావుపేట పట్టణ కో-ఆర్డినేటర్ టి.సాంబయ్య పాల్గొన్నారు.
