ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : దేవి విగ్రహ నిమజ్జనం సందర్భంగా కోటిపల్లి గోదావరిలో ఆదివారం రాత్రి గల్లంతైన యువకులు మృతి చెందారు. ఈ మేరకు గాలింపు జరుగుతున్న పోలీసులు సోమవారం మృతదేహాలను కొనుగొన్నారు. మండలం లోనీ రావి చెరువు గ్రామానికి చెందిన మేడిశెట్టి వీర బ్రహ్మ (35) నరాల వేదమూర్తి (30) గా గుర్తించారు. మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి తరలించారు. కే గంగవరం ఎస్‌ఐ జానీ భాష కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకులు మృతితో రావి చెరువు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
