జోరుగా నామినేషన్లు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లా ల్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం జోరందుకుంది. మొదటి రోజైన గురువారం పార్లమెంట్‌ స్థానాలకు నాలుగు, శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లను దాఖలు చేశారు. కడప పార్లమెంట్‌ అభ్యర్థులుగా టిడిపి తరుపున చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి, అన్నా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరుపున షేక్‌ చాన్‌బాషా, రాజంపేట పార్లమెంట్‌కు వైసిపి అభ్యర్థి పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి తరుపున ఆయన తల్లి స్వర్ణలత, ఇండిపెండెంట్‌ అభ్యర్థి మాదా రాజా నామినేషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తే కడప అసెంబ్లీకి జాతీయ చేనేత ఐక్య వేదిక పార్టీ తరుపున అవ్వారు మల్లికార్జున, అన్నా కాంగ్రెస్‌ తరుపున షేక్‌ మహబూబ్‌బాషా, ఇండిపెండెంట్‌గా మధురభారతం వెంకటసుధీర్‌ కుమార్‌, మైదుకూరుకు వైసిపి తరుపున శెట్టిపల్లి రఘురామిరెడ్డి, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి షేక్‌ మహబూబ్‌బాషా, అన్నా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున శ్రీయ్యపురెడ్డి రఘురామిరెడ్డి, ప్రొద్దు టూరులో సమాజ్‌వాదీ పార్టీ తరుపున కందింట పెద్దన్న, జమ్మలమడుగుకు ఇండ ిపెండెంట్‌గా అల్లెప్రభావతి, బిజెపి తరుపున చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి సతీమణి అరుణ నామినేషన్లు దాఖలు చేశారు. బద్వేలు, పులివెందుల, కమలాపురం అసెంబ్లీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట అసెంబ్లీకి వైసిపి తరుపున ఆకేపాటి అమరనాధరెడ్డి, రైల్వేకోడూరులో కొరముట్ల శ్రీనివాసులు, తంబళ్లపల్లిలో ద్వారకనాధరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. టిడిపి తరుపున మదనపల్లిలో షాజహాన్‌బాషా, పీలేరులో నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. టిడిపి ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి కేసుల వివరాలను పరిశీలిస్తే సుమారు ఏడు రకాల కేసులు నమోదు చేసినప్పటికీ ఏఒక్కటీ ఛార్జీషీటు వేయలేదు. ఆస్తుల, నగదు వివరాలను పరిశీలిస్తే రూ.రెండు లక్షల నగదు, భూములు మార్కెట్‌ విలువ ప్రకారం రూ.62.17 లక్షల ఉన్నట్లు చూపించారు. ఎల్‌ఐసి పాలసీల రూపంలో రూ.9,60, 266 లక్షలు చూపించడం గమనార్హం. ఆయన సతీమణి చదిపిరాళ్ల జ్యోతి నగదు రూ.20 వేలు బ్యాంకుల సేవింగ్స్‌ రూ.85,88,025 లక్షలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రాజంపేట వైసిపి అభ్యర్థి ఆకేపాటి అమరనాధరెడ్డి ఆస్తుల వివరాలను పరిశీలిస్తే రూ.49.79 లక్షలు విలువ కలిగిన ఆస్తులు, నిర్మాణ దశలో ఉన్న ఆస్తులు రూ.1,25,21 లక్షలు విలువ కలిగిన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దాఖలు చేశారు. బద్వేలు, పులివెందుల, కమలాపురం అసెంబ్లీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట అసెంబ్లీకి వైసిపి తరుపున ఆకేపాటి అమరనాధరెడ్డి, రైల్వేకోడూరులో కొరముట్ల శ్రీనివాసులు, తంబళ్లపల్లిలో ద్వారకనాధరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. టిడిపి తరుపున మదనపల్లిలో షాజహాన్‌బాషా, పీలేరులో నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. టిడిపి ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి కేసుల వివరాలను పరిశీలిస్తే సుమారు ఏడు రకాల కేసులు నమోదు చేసినప్పటికీ ఏఒక్కటీ ఛార్జీషీటు వేయలేదు. ఆస్తుల, నగదు వివరాలను పరిశీలిస్తే రూ.రెండు లక్షల నగదు, భూములు మార్కెట్‌ విలువ ప్రకారం రూ.62.17 లక్షల ఉన్నట్లు చూపించారు. ఎల్‌ఐసి పాలసీల రూపంలో రూ.9, 60, 266 లక్షలు చూపించడం గమనార్హం. ఆయన సతీమణి చదిపిరాళ్ల జ్యోతి నగదు రూ.20 వేలు బ్యాంకుల సేవింగ్స్‌ రూ.85,88,025 లక్షలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రాజంపేట వైసిపి అభ్యర్థి ఆకేపాటి అమర నాధరెడ్డి ఆస్తుల వివరాలను పరిశీలిస్తే రూ.49.79 లక్షలు విలువ కలిగిన ఆస్తులు, నిర్మాణ దశలో ఉన్న ఆస్తులు రూ.1,25,21 లక్షలు విలువ కలిగిన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

➡️