ప్రజాశక్తి – తుగ్గలి : పత్తికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఐ టీ వింగ్ అధ్యక్షులుగా మండల కేంద్రమైన తుగ్గలి కి చెందిన ఎం. చంద్రశేఖర్ రెడ్డిని ఎంపిక చేస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైఎస్ఆర్సిపి ఐటి వింగ్ అధ్యక్షులుగా ఎన్నికైన ఎం చంద్రశేఖర్ రెడ్డి మండల కేంద్రమైన తుగ్గలి కు చెందిన మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి (తుగ్గలి ప్రతాపరెడ్డి కుమారుడు) మనవుడు. ఈ సందర్భంగా ఎం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తనకు పదవి ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ సిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కు విధేయుడుగా ఉంటూ వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అలాగే తనకు పదవి రావడానికి సహకరించిన జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ,వైసిపి నాయకులు తుగ్గలి శ్రీనివాస్ రెడ్డి, తుగ్గలి మోహన్ రెడ్డిలతోపాటు, మండల వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.
వైయస్సార్ సిపి ఐటి వింగ్ అధ్యక్షులుగా ఎం చంద్రశేఖర్ రెడ్డి
