ప్రజాశక్తి -అనంతపురం : అనంతపురం నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎం ప్రసాద్ బాబు ఆదివారం డిఈఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … జిల్లా విద్యాశాఖను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్ష ఫలితాలు పైన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా నూతన విద్యాశాఖ అధికారికి కార్యాలయ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.