ప్రజాశక్తి – ఏలేశ్వరం : ఏలేశ్వరం నగర పంచాయతీ నూతన కమిషనర్ గా ఎం సత్యనారాయణ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. సత్యనారాయణ అద్దంకి మున్సిపల్ కార్యాలయం నుండి ఏలేశ్వరం బదిలీపై వచ్చారు. ప్రస్తుత కమిషనర్ గా ఉన్న కేశవ ప్రసాద్ విశాఖ జోనల్ కమిషనర్ గా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధుల సహకారంతో ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధి కృషి చేస్తానన్నారు.
