ప్రజాశక్తి-టంగుటూరు : రైతులకు వ్యక్తిగతంగా యంత్ర పరికరాలు ఇవ్వ డానికి ప్రభుత్వం అను మతి ఇచ్చిందని, త్వరలో రైతులకు వ్యక్తిగతంగా యంత్ర పరికరాలు అంద జేస్తామని జిల్లా వ్యవ సాయాధికారి శ్రీనివాస రావు తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు నువ్వు విత్తనాలు, సూక్ష్మపోషకాల ఎరువులు అయిన జింకు, జిప్సం, బోరాన్‌లను రాయితీ మీద ఇవ్వనున్నట్లు తెలిపారు. మండలంలోని కాకుటూరివారి పాలెం గ్రామంలో మండల వ్యవసాయాధికారి అధ్యక్షతన పొలం పిలుస్తోంది కార్యక్రమం రబీ 2024-25 సీజన్‌కు ”ఈ-పంట” సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించి నట్లు తెలిపారు. ఈ రబీ సీజన్లో ”ఈ పంట” నమోదు చేసిన రైతుల జాబితాను ప్రతి రైతు సేవా కేంద్రాల్లో సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించి గ్రామసభ నిర్వహిస్తారని తెలిపారు. ఈ జాబితాల్లో ఏవయినా తప్పులు నమోదయి ఉంటే ఆయా గ్రామాల్లో ఉన్న వ్యవసాయ సహాయకులు గ్రీవెన్స్ రూపంలో తెలియజేస్తే సరిచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్యాలయంలో పని చేస్తున్న సాంకేతిక వ్యవసాయ అధికారి శ్రీనివాస్ నాయక్, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి శైలజ, గ్రామ వ్యవసాయ సహాయకులు ఐ ప్రావీణ్యం, వ్యవసాయ విస్తరణ అధికారులు సిహెచ్ ఎన్ శ్రీనివాసరావు, ఎన్ వేంకటేశ్వర్లు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
