పిచ్చికుక్క స్వైరవిహారం – పశువులకు గాయాలు

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో వెదురుకుప్పం మండలం, మాంబేడు గ్రామం, కాలనీలో ఓ పిచ్చి కుక్క ఆదివారం రాత్రి నుంచి రైతుల పశువులను గాయపరుస్తూ ఉంది. పశువులను కాపాడుకునే ప్రయత్నంలో పాడి రైతులు పశువులకు కాపలాకాస్తున్నారు. కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ పిచ్చికుక్క దాడిలో 18 పశువులు, లేగ దూడలకు గాయాలయ్యాయి. మనుషులపై కూడా తిరగబడుతుందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వీధి కుక్కలను నియంత్రణ చేయాలని కోరుతున్నారు. గాయపడిన పశువులకు చికిత్స చేయాల్సి అవసరం ఎంతైనా ఉందని అధికారులు సాయపడాలని రైతన్నలు కోరుతున్నారు.

➡️