నేడు మాగుంట సుబ్బరామిరెడ్డి సంస్మరణ సభ

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : మాజీ పార్లమెంట్‌ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి 29వ వర్థంతి సందర్భంగా ఒంగోలు పివిఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సంస్మరణ సభ, భారీ అన్నదాన కార్యక్రమం ఆదివారం జరగనుంది. సంస్మరణ సభ, అన్నదాన కార్యక్రమానికి మాగుంట అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం రాంనగర్‌ 2వ లైన్‌లోని మాగుంట కార్యాలయంలో మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. తరువాత ఒంగోలు నగరంలోని హౌటల్‌ అభిలాష్‌ సెంటర్‌, రైల్వే స్టేషన్‌ రోడ్డులోని ఎస్‌బిఐ వద్ద, అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లోని మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పివిఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలలో మాగుంట సుబ్బరామరెడ్డి సంస్మరణ కార్యక్రమం జరగనుంది. ఇందులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామితో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ పాల్గొననున్నారు. తరువాత మాగుంట సుబ్బరామరెడ్డి విద్యా సంస్థలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలను ఇవ్వనున్నారు. ఏర్పాట్ల పరిశీలన స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి సంస్మరణ సభ, అన్నదాన కార్యక్రమ ఏర్పాట్లను ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయులు మాగుంట రాఘవరెడ్డి, నిఖిల్‌రెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించారు. అన్నదాన కార్యక్రమానికి సిద్ధం చేస్తున్న స్వీట్స్‌, కూరగాయలను వారు పరిశీలించి వంట వారికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తాతా ప్రసాద్‌, ఏవి రమణారెడ్డి, కుప్పా రంగనాయకులు, ఆత్మకూరి బ్రహ్మయ్య, బెల్లం సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️