చెరుకు రైతులు ఆశలు నెరవేర్చని మహజన సభ : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.వెంకన్న

చోడవరం (గోవాడ) : మహజన సభ చెరుకు రైతులు ఆశలను నెరవెర్చలేకపోయిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న అన్నారు ఆదివారం వెంకన్న ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ … 28 న గోవాడ చక్కెర కర్మాగారం లో ప్రతిఏడాది సభ్యులతో నిర్వహించిన మహాజన సభ ఈ సంవత్సరం కూడా జరిగిందని తెలిపారు. సభలో ఇలాంటి హామీలు ఇవ్వక పోవడంతో రైతుల ఆశలను ఆవిరి చేసినట్లు అయ్యిందన్నారు. మధ్యాహ్నం ఫ్యాక్టరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.ఎస్‌ నాయుడు ఆధ్వర్యంలో చోడవరం, మాడుగుల నియోజక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు భారీగా రైతులుతో జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించారని తెలిపారు కాని ప్రయోజనం శూన్యమన్నారు. ఫ్యాక్టరీలో చాలా అవకతవకులు జరుగుతున్నాయని, 2010 నుండి జరిపిన లావా దేవీలపై సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని రైతులు డిమాండ్‌ ను ఈ ప్రభుత్వం పెడ చెవిన పెట్టిందని తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఫ్యాక్టరీ పర్సన్‌ ఇన్చార్జి, జిల్లా కలెక్టర్‌ విజయకఅష్ణన్‌ రానున్న సీజన్‌ కు చెరుకు మద్దతు ధర టన్నుకు రూ 3151లుగా కేంద్రం నిర్ణయించిందని తెలిపారని కానీ ఇది రైతులకు ఏమూలకు సరిపోదని తెలిపారు. అయితే రైతులు చెల్లించవలసిన చెరుకు బకాయిలు, గాని కార్మికులకు చెల్లించవలసిన వేతన బకాయిలు, గ్రాట్యుటీ, జమ చేయవలసిన పిఎఫ్‌ బకాయిలుపై స్పష్టత ఇవ్వక పోవడంతో దుర్మార్గమన్నారు. చెరుకు మద్దతు ధర టన్నుకు రూ.4000 ఇస్తామని కూటమి నాయకులు చెప్పారని ఇప్పుడు రైతులు పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు. రైతులకు ఉచితంగా చెరుకు విత్తనం, ఎరువులు ఇప్పించి ప్రోత్సహిస్తేనే ఫ్యాక్టరీ మనుగడ ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో రూ.89 కోట్ల నిధులు ఫ్యాక్టరీకి ఇచ్చిందని తెలిపారు. ఇంకా రైతులకు చెల్లించవలసిన చెరుకు బకాయిలు టన్నుకు రూ. 419.75 పైసలు వారం రోజులు లోగా ఇప్పించాలని, మద్దతు ధర రూ 3151 ప్రకటించినందున దానికి ప్రభుత్వ సహకారంగా మరో రూ.900 వచ్చేటట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. సిబిఐ విచారణ జరిపించాలని, మహాజన సభలో రైతులు కార్మికుల బకాయిలపై స్పష్టత ఇవ్వాలని కోరారని కనీసం పట్టించుకోలేదన్నారు. చెరుకు మద్దతు ధర ఇవ్వకపోవడమే కాకుండా సంవత్సరాలు తరబడి పిఎఫ్‌ డబ్బులు కట్టకపోవడం చాలా దారుణమని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో అవినీతి రాజ్యమేలుతుందని గతంలో చాలాసార్లు అధికారులు విచారణ జరిపినా చర్యలు తీసుకోకపోవడంతో అవినీతి దారుణంగా పెరుగిపోతుందని తెలిపారు. రిటైర్డ్‌ అయిన కార్మికులకు పిఎఫ్‌. గ్రాట్యూటీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఫ్యాక్టరి దొంగలను కాపాడే ఫ్యాక్టరీగా ఉందని రైతులను ఆదుకునే ఫ్యాక్టరీగా లేదని ఆరోపించారు. కార్మికులు, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హమిని అమలు చేయాలని ఫ్యాక్టరిని ఆధునీకరించాలని వెంకన్న డిమాండ్‌ చేశారు.

➡️