జెఎన్‌ టియుజివి లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ విజయనగరం లో బుధవారం ‘జాతిపిత’ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్ర పటానికి జె ఎన్‌ టి యు ఇంచార్జి వైస్‌-ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌. డి. రాజ్య లక్ష్మి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఇంచార్జి వైస్‌ – ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, భారత స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ పాత్రని ఈ సందర్భంగా గుర్తుచేసారు. శాంతి, అహింస మార్గంలో నడిచిన ‘జాతిపిత’ మహాత్మాగాంధీ అడుగుజాడలలో ప్రతీ ఒక్కరు నడవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమములో టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పాల్గొన్నారు.

➡️