ఎన్‌ఎస్టీఎల్‌ లో ఘనంగా మహత్మా గాంధీ , లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ లాబరేటరీలో 155వ గాంధీ జయంతి, 120వ లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మానసి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్టీఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అబ్రహం వర్గీస్‌,వర్క్స్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ హెచ్‌ఎన్‌ దాస్‌, వేడుకల కమిటీ చైర్మన్‌ రవి ఆనంద్‌,వర్క్స్‌ కమిటీ సెక్రటరీ బాల్మీకీ పండిట్‌,ఎన్‌ఎస్‌టిఎల్‌ సిఇ యూనియన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌ చంద్‌,సిఇ యూనియన్‌ సెక్రటరీ జెఎన్‌ వర్మ తదితరులతో కలిసి మహాత్మా గాంధీ ,లాల్‌ బహదూర్‌ శాస్త్రి ల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డాక్టర్‌ అబ్రహం వర్గీస్‌ మాట్లాడుతూ భారతదేశ స్వేచ్ఛ , అభివఅద్ధిలో ఈ ఇద్దరు గొప్ప నాయకుల కఅషిని గుర్తు చేసుకున్నారు. వారి సమగ్రత , త్యాగం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 50 మంది నిరుపేద పాఠశాల విద్యార్థులకు స్టడీ కిట్‌లను అందచేశారు.

➡️